Illu Illalu Pillalu: శ్రీవల్లిని బెదిరించిన విశ్వ.. ధీరజ్ ఆన్ ఫైర్!
on Jan 14, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu Illalu Pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-368 లో.. అమూల్య ఎంగేజ్ మెంట్ కి తనకి రింగ్ తీసుకోవడానికి ప్రేమ, ధీరజ్ బైక్ పై వెళ్తారు. అక్కడ ఒక జ్యువెలరీ షాప్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ప్రేమ బాగుందని కాంప్లిమెంట్ ఇస్తాడు షాప్ అతడు. అది చూసి ధీరజ్ కుళ్ళుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి గొడవపడుతుంటారు. అది చూసిన షాప్ అతను.. మీది లవ్ మ్యారేజ్ కదా అని అంటాడు. ఎస్ ఎలా కనిపెట్టారని ప్రేమ అనగానే మీ అల్లరి చూసి అని షాప్ అతను అంటాడు.
ఇక ధీరజ్ ఒక రింగ్ సెలెక్ట్ చేసి ఎలా ఉందో చెక్ చేయడానికి ప్రేమ చేతి వేలికి పెడతాడు. ఇక ఆ రింగ్ ప్రేమకి బాగా నచ్చుతుంది. అది వేలికి గట్టిగా ఫిక్స్ అయిందని రావట్లేదని ప్రేమ యాక్ట్ చేస్తుంది. షాప్ అతను కూడా ప్రేమతో కలిసి యాక్ట్ చేస్తాడు. దాంతో ధీరజ్ చేసేదేమీ లేక ప్రేమకి ఆ రింగ్, అమూల్యకి మరో రింగ్ ని తీసుకుంటాడు. ఇక ఇద్దరు అక్కడి నుండి బయల్దేరి వస్తారు.
మరోవైపు శ్రీవల్లి ఏ చీర కట్టుకోవాలని సంబరపడుతుంది. అదే సమయంలో శ్రీవల్లికి విశ్వ కాల్ చేస్తాడు. ఇంట్లో శుభకార్యం జరగకుండా చూసుకోవాలి.. నువ్వే ఈ ఎంగేజ్ మెంట్ ఆపాలని శ్రీవల్లితో విశ్వ అంటాడు. అలా చేయనని శ్రీవల్లి అంటుంది. అయితే నీ ఫోటోలు మీ మామయ్యకి పంపిస్తానని విశ్వ అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతూ అంటుంది. ఈ ఎంగేజ్ మెంట్ జరిగితే.. నీ నిజస్వరూపాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్తానని విశ్వ బెదిరిస్తాడు. దాంతో శ్రీవల్లి సరేనంటుంది.
ఇక అదే కోపంతో భాగ్యంకి కాల్ చేస్తుంది శ్రీవల్లి. నీ వల్లే ఆ బండోడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని భాగ్యాన్ని శ్రీవల్లి తిడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు బేబీ.. నేను అక్కడికే వస్తున్నాను.. చక్రం తిప్పుతానని భాగ్యం అనగానే సరేనని శ్రీవల్లి అంటుంది.
మరోవైపు ప్రేమ నగలు వేసుకొని రెడీ అవుతుంది. అవి ప్రేమకి వాళ్ళ అమ్మ ప్రేమతో ఇచ్చిన నగలు.. కానీ ధీరజ్ వాళ్ళ నాన్న రామరాజు మాటలు పడటానికి కారణం కూడా అవే నగలు.. ఇక ప్రేమ ఆ నగలతో రెడీ అవ్వడం ధీరజ్ చూస్తాడు. వెంటనే వాటిని తీసేయమని ధీరజ్ అంటాడు. ప్రేమ డిజప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



